ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడిలో పలువురు చిన్నారులు బలి కావడం తెలిసిందే. అయితే తాజాగా, కుక్కకాటుకు సంబంధించి పంజాబ్-హర్యానా హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. ప్రజలపై వీధి కుక్కల దాడుల నేపథ్యంలో హైకోర్టులో 193 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన పంజాబ్-హర్యానా హైకోర్టు.. వీధుల్లో శునకాలు, ఇతర జంతువుల దాడిలో పౌరులు గాయపడితే ప్రభుత్వం తప్పక పరిహారం చెల్లించాలని, ఒక్కో పంటి గాటుకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa