ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటినుండి (బుధవారం) ‘సమగ్ర కులగణన’ కార్యక్రమం చేపట్టనుందని బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. దీనికి సంబంధించి ఈనెల మూడో తేదీనే కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి కులగణనకు ఆమోదం తెలియజేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల నిరుపేదలకు సామాజిక, సాధికారతా సురక్షను కల్పించడమే లక్ష్యంగా సమగ్ర కుల గణన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.