వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో తలసరి ఆదాయంలో ఏపీ 17వ స్థానంలో ఉంటే.. నేడు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో 9వ స్థానంలో ఉందని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో వ్యవసాయ రంగంలో ఏపీ 6వ స్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు పాలనలో రాష్ట్రం 27వ స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. 13 లక్షల మందికి ఎంఎస్ఎంఈ ద్వారా ఉపాధి కల్పించామని, పారిశ్రామిక రంగంలో ఏపీకి 3వ స్థానం వచ్చిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు.