జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి (ఇన్చార్జి) కేపీ బాలాజీ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 9న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తెనాలిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.