చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో,మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్,చింద్వారా జిల్లా భారతీయ జనతా యువమోర్చా మాజీ అధ్యక్షుడు, బిజెపికి చెందిన వివేక్ బంటీ సాహుపై తన సొంతగడ్డపై పోటీ చేస్తున్నారు.
కమల్ నాథ్ 2019లో చింద్వారా నుంచి బీజేపీకి చెందిన సాహుపై 25,837 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మార్చి 2020లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చెయ్యడంతో ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ పదవీకాలం ముగిసింది. అదే సమయంలో మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది.