ధర్మవరం పట్టణం దుర్గా నగర్ కు చెందిన శ్రీనివాసులు అనే చేనేత కార్మికుడు గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసులు రెండు మగ్గాలు వేసుకొని జీవిస్తూ ఉండేవాడని, మగ్గాల మీద రూ. 10 లక్షల వరకు అప్పులు అయ్యాయని తెలిపారు. అప్పు తీర్చే మార్గం కనపడక సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.