'ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి - కరవు' రెండూ కవల పిల్లలు లాంటివని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇద్దరిదీ విడదీయలేని బంధమని.. జగన్ ఎక్కడుంటే, కరవు అక్కడ ఉంటుందని విమర్శించారు. రైతుల్ని ఓడించిన జగన్ పనైపోయిందని.. ఐరన్ లెగ్ జగన్ను ఏపీ మొత్తం ద్వేషిస్తోందని మండిపడ్డారు.