తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు డిసెంబర్ 8 నుంచి సమ్మె చేయనున్నారు. CITU, AITUC, IFTU కలిసి ఉమ్మడిగా సమ్మెను నింర్వహించనున్నారు. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వగా.. ఈనెల 20న జిల్లాల్లో పీడీలు, సీడీపీవోలకు ఇవ్వనున్నారు. తెలంగాణలో కంటే 1000 అదనపు వేతనం, విధి నిర్వహణలో చనిపోతే రూ.5లక్షల పరిహారం వంటివి అంగన్వాడీల ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.