ఉపాధ్యాయుల పనితీరుపై ఏపీ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఫైర్ అయ్యారు. ‘నేను ఆర్డర్ ఇస్తే.. అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే రాదు. ఏమనుకుంటున్నారో.. మీ ఇష్టం’ అంటూ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా మొగిలిచర్ల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల వద్ద పుస్తకాలు లేకపోవటం, వారి అసైన్ మెంట్లు సరిగా లేకపోవటంతో టీచర్లను మందలించారు.