రాజస్థాన్ చురు జిల్లాలో పోలీస్ వ్యాన్‌కు జరిగిన ప్రమాదంపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురు పోలీసు అధికారుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘‘ఈరోజు ఉదయాన్నే హృదయాన్ని పిండేసే వార్త తెలిసింది. మృతుల కుటుంబాలకు నా సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’అని ఆయన పేర్కొన్నారు.