కాకుమాను మండల కేంద్రంలోని శాఖ గ్రంధాలయంలో ఆదివారం 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. గ్రంథాలయ అధికారి జోగి మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి గ్రంథ పఠనం చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఎంపీపీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.