అమెరికాలోని న్యూహాంప్ షైర్ రాష్ట్ర రాజధాని కాంకార్డ్‌లోని సైకియాట్రిక్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దుండగుడి కాల్పులు ఆసుపత్రి లాబీ వరకే పరిమితం కావడంతో లోపల ఉన్న రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకొని జరిపిన కాల్పుల్లో అనుమానితుడు చనిపోయాడన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa