పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాస్‌లోని ఖర్దాలో తాజాగా దారుణం జరిగింది. బృందాబన్ కర్మాకర్ అనే వ్యక్తి వృత్తిరీత్యా గార్మెంట్స్ వ్యాపారి. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను కర్మాకర్ పలుమార్లు హెచ్చరించాడు. ఆమె వివాహేతర సంబంధం వదులుకోలేదని కోపం పెంచుకున్నాడు. తొలుత భార్యను పదునైన ఆయుధంతో నరికి చంపాడు. తర్వాత 16 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కొడుకును హత్య చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.