ఏపీలోని మన్యం జిల్లాలోని ఓ పేద కూలీ కుటుంబంలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. పుట్టూరులో ఆదిమూలం లక్ష్మణరావు అనే వ్యక్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం సుమారు రెండేళ్ల పాటు కష్టపడి రూ.2లక్షలకు పైగా ట్రంక్ పెట్టెలో దాచాడు. ఇంతలో 6నెలల క్రితం ప్రమాదవశాత్తు అతను మరణించాడు. దీంతో ఎవరూ ఆ ట్రంక్ పెట్టెను తెరవలేదు. ఇటీవల మృతుడి కుటుంబం పెట్టె తెరవడంతో అంతా చెదలు, పురుగుల మధ్య నోట్ల ముక్కలు మిగలగా కన్నీరుమున్నీరయ్యారు.