విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఘటన సమయంలో ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాత్రి ఫిషింగ్ హార్బర్లో సదరు యూట్యూబర్ పార్టీ ఏర్పాటు చేశాడని.. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ యూట్యూబర్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.