రాప్తాడు మండలం చిన్మయనగర్ కళాకారుల కాలనీలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఆణిముత్యాలు పౌరాణిక నాటకాన్ని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు వీఎస్ పవన్ & దిలీప్ కుమార్ పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. కాలనీలో ప్రదర్శించిన నాటకంలోని శ్రీ రామాంజనేయయుద్ధం, చింతామణి తదితర సన్నివేశాలు పలువురిని ఆకట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలు విరివిగా హాజరై నాటకాన్ని తిలకించారని తెలిపారు.