అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటనజరిగింది. మంటల్లో ఏడేళ్ల బాలిక సజీవ దహనం అయ్యింది. చింతపల్లి మండలం అన్నవరంనకు చెందిన కుటుంబం సంతలో తిను బండారాలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం కూడా సంతకు వెళ్లేందుకు తినుబండారాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో నూనెతో ఉన్న కళాయి తిరగడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఏడేళ్ల చిన్నారి నిత్య చిక్కుకుపోయింది.. పూరి గుడిసె కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఈ ఘటనలో చిన్నారి సజీవ దహనం అయ్యింది. నిత్య రెండవ తరగతి చదువుతోంది. పాప మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. కళాయిలో నూనె దొర్లిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సంత కోసం తిను బండారాలు తయారు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.