టీడీపీ నేతల బృందం నేడు ఢిల్లీ వెళ్లనుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫాం-6, 7 అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లే టీడీపీ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు.