బాల కార్మికులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వాహనాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ లేబర్ ఆదేశాల మేరకు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10 వరకు బాల కార్మికులను గుర్తించి, వారిని ఆయా వృత్తుల నుంచి బయటకు తీసుకొచ్చి విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్లో చేర్పిస్తామన్నారు