వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఎస్సీలు, బీసీలు, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్న గత పాలకులు. 25 మంది మంత్రులుంటే 17 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. 8 మంది రాజ్యసభకు వెళ్తే నలుగురు బీసీలకు, మండలి చైర్మన్ ఎస్సీకి ఇచ్చారు. సామాజిక న్యాయం అంటే ఏంటో దేశానికే కాదు, ప్రపంచానికే చాటి చెప్పిన జగనన్న. రాజ్యసభ సీట్లను కౌంటర్ ఓపెన్‌చేసి రూ.50 కోట్లు, 100 కోట్లకు బేరం పెట్టిన చంద్రబాబు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని ఎవరైనా గతంలో చెప్పారా? నరసరావుపేట నియోజకవర్గంలో సుమారు రూ.560 కోట్లు డైరెక్ట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జమ చేశారు. రూ.280 కోట్ల ఇళ్ల స్థలాలు తదితర నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.830 కోట్లు ఇచ్చారు. నియోజకవర్గంలో 80 వేల ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. 65 సంవత్సరాల కల.. నరసరావుపేటను జిల్లా కేంద్రం చేయాలనే కోరికను వరమిచ్చి నెరవేర్చారు అని ఆనందాన్ని వ్యక్తపరిచారు.