జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే దేశం-ఒకే ఎన్నికకు మద్దతు ఇవ్వాలని కోరారు. జమిలి ఎన్నికల వల్ల ఆదా అయ్యే డబ్బును అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయొచ్చు అని తెలిపారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి రామ్నాథ్ కోవింద్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.