ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 01:35 PM

కొవ్వూరు పట్టణంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే...... కొవ్వూరు పట్టణానికి చెందిన బైరెడ్డి లక్ష్మి, సత్యంలకు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్‌ (15) 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడు తరచుగా సెల్‌ఫోన్‌ చూస్తుండడంతో అది మంచిది కాదని ఇటీవల తల్లిదండ్రులు మందలించారు. అప్పటి నుంచి కాస్త ముభావంగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం స్కూ లుకి వెళ్లలేదు. స్కూలు వెళ్లమని చెప్పి సోమవారం తల్లిదండ్రులు ఇద్దరు ప్రతిరోజు మాదిరిగా ఉదయం పనికివెళ్లారు.పని ముగించుకుని 10:30 గంటల సమయంలో ఇంటికి వచ్చారు. తలుపుతీసి చూడగా పెద్దకుమారుడు దుర్గాప్రసాద్‌ ఇంటిలో ఉరిపోసుకుని వేళాడుతూ కనిపించాడు. కంగారుపడి భర్తకు ఫోన్‌ చేసి, చుట్టుప్రక్కల వారి సహాయంతో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తర లించా రు.వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు.దీంతో తల్లిదండ్రులు మృతదేహా న్ని పట్టుకుని విలపించారు.ఎంత పనిచేశావురా అంటూ కన్నీటిపర్యం తమయ్యారు.మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com