స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే జోరును కొనసాగించింది. సెన్సెక్స్ 276 పాయింట్లు లాభపడి 65,931 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 19,783 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.76%), టాటా స్టీల్ (1.45%), టైటాన్ (1.44%), రిలయన్స్ (1.24%), సన్ ఫార్మా (1.18%).
టాప్ లూజర్స్ : టెక్ మహీంద్రా (-0.63%), మారుతీ (-0.48%), ఎల్ అండ్ టీ (-0.47%), NTPC (-0.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.41%).