కోవిడ్‌తో ఆర్థికంగా కుదేలైన చిరువ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం స్వానిధి యోజన'(PM SVANidhi) పథకాన్ని అమలు చేస్తోంది. http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్ అందిస్తోంది. తొలుత రూ.10 వేలు, అది చెల్లిస్తే రూ.20 వేలు ఇలా రూ.50 వేల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. సకాలంలో లోన్ చెల్లిస్తే వడ్డీ రాయితీ కూడా అందుతుంది.