రాష్ట్ర వ్యాప్తంగా జరిమానాల రూపంలో వసూలు చేసిన రూ. 37 కోట్ల ఈ-చలానా స్కాం కేసులో నిందితుడు అవినాష్ కొమ్మిరెడ్డిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు మాట్లాడుతూ అవినాష్ అమెజాన్ క్రౌడ్ సర్వీసెస్ కొనుగోలు చేసి, వాటిని వేరే కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా డబ్బులు మళ్లించారని వెల్లడించారు. ఈ కుంభకోణానికి సంబంధించి సమగ్ర విచారణకు అంతర్గత కమిటీని వేసినట్లు చెప్పారు.