నేడు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు నోవాసిస్ హోటల్లో వైయస్ఆర్సీపీ నేతల విలేకర్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కర్నూల్ రోడ్డు బైపాస్ నుండి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగనుంది. 4 గంటలకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో రీజనల్ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, తదితరులు హాజరుకానున్నారు.