ట్విట్టర్ (X) అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మస్క్ కీలక విషయాన్ని ప్రకటించారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయం అందిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మస్క్ నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa