ఈరోజు(గురువారం) తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి మండలం రామవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద గుర్తుతెలియని దుండగులు హల్చల్ చేశారు. నలుపు రంగు కారులో ఇంటి వద్ద పోలీస్ సైరన్ మోగిస్తూ దుండగులు వీరంగం సృష్టించారు. దీనిపై అనపర్తి పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు.