అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీఐడీ ఏపీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరింది.
తన అనుచరులకు లబ్ధి చేకూరేలా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారని 470 పేజీలతో అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా మరికాసేపట్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది.