బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని దీన్ని ఫ్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. భారీవర్షాల నేపథ్యంలో చెన్నై నగరంలో పాఠశాలలను మూసివేశారు. తమిళనాడులోని పలు జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
పుదుచ్చేరి, కారైకల్‌లలో కూడా భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు వివరించారు. తమిళనాడులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బురద, కొండచరియలు విరిగిపడ్డాయి. తమిళనాడులోని ఇతర జిల్లాలతో పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో శనివారం ఉరుములతో పాటు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. భారీవర్షాల వల్ల ట్రాఫిక్ స్తంభించే పోయే అవకాశం ఉంది.