ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కోర్టులన్నా లెక్క లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా... మరోవైపు హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ప్రభుత్వ శాఖలను దొడ్డిదారిన విశాఖకు తరలించేందుకు సిద్ధమవడం దేనికి సంకేతమని నిలదీశారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున జగన్ మరోసారి మూడు రాజధానుల కుట్రకు తెర లేపారని విమర్శించారు. దేశ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేసిన ఘనత జగన్‌రెడ్డిదేనని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మరో ప్రకటనలో ఆర్టీసీలో వైఎ్‌సఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక వివరణాత్మక ప్రకటన జారీ చేశారు.