ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ తీహార్‌ వెళ్ళక తప్పదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2023, 12:27 PM

ముఖ్యమంత్రి జగన్‌కు రెండోసారి జైలువాసం తప్పదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేశారు. జగన్‌రెడ్డి తాను చేస్తున్న పాపాలకు ఈసారి తీహార్‌ జైలు తప్పదన్నారు. మరో ప్రకటనలో... ‘‘సీఎం జగన్‌రెడ్డి స్వయం ప్రకటిత చక్రవర్తిలా నియంత పోకడలతో మొండిగా ముందుకు సాగుతున్నాడు. హైకోర్టు తీర్పులని కూడా ధిక్కరిస్తూ ఏం ఉద్ధరిద్దామని ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి మారుస్తున్నారో జగన్‌రెడ్డే సమాధానం చెప్పాలి’’ అని అచ్చెన్న డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com