ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా ఆదివారం కంబదూరు మండల కేంద్రంలో రాజ్యాంగం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీ చరణ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.