కొత్తచెరువు మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో నిరుపేద కూలికి విద్యుత్ బిల్లు 43, 516 రూపాయలు వచ్చింది. అద్దెఇంట్లో నివసిస్తున్న కూలి నాగమణికి వేళల్లో విద్యుత్ బిల్లు వస్తుండడంతో బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. గత నెల విద్యుత్ బిల్లు 9000 వచ్చిందని, ఈ నెలలో 43, 516 రూపాయలు రావడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై శనివారం ట్రాన్స్ కో ఏఈ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ సమస్య తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.