ప్రపంచానికే ఆదర్శంగా భారత దేశ రాజ్యాంగం నిలుస్తోందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, కమిషనర్ భాగ్యలక్ష్మి లతో కలిసి హాజరయ్యారు.