గుత్తి పట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలను ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థినులతో సమావేశం నిర్వహించి గురుకుల పాఠశాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్, పట్టణ నాయకులు విజయ్, కిరణ్, ఆది, చిరంజీవి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.