పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై వచ్చే నెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది. ఈ నెల 16వ తేదీన ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్షించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేవర్షి ముఖర్జీ భావించారు.
కానీ ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమీక్షలోగా 41.15 మీటర్ల కాంటూరులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ సీపేజీ నివారణ, గైడ్‌బండ్ పనులకు సంబంధించి కార్యాచరణను ఖారారు చేసే వీలుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa