యూపీలోని బారాబంకీ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సీతాపూర్‌కు చెందిన మోతీలాల్ చౌహాన్, రజని (24) భార్యాభర్తలు. బుధుపూర్వాలోని మోతీలాల్ తాపీ పని చేస్తున్నాడు. తన భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని మోతీలాల్ అనుమానించేవాడు.
ఈ విషయంలో భార్యతో అతడు సోమవారం గొడవ పడ్డాడు. కోపంలో గడ్డపారతో దాడి చేశాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.