రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హుస్సేన్ అనే విద్యార్థి నీట్‌కు సిద్ధమవుతున్నాడు. శిక్షణ కోసం గతేడాది నుంచి స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గది నుంచి ఎంతకీ బయటకు రాలేదు. అనుమానంతో స్నేహితులు అతడికి ఫోన్ చేసినా స్పందించలేదు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. గది తలుపులు తెరిచారు. అక్కడ ఉరి వేసుకుని కనిపించిన ఆ విద్యార్థిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే, తన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించలేదు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.