అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల లో మంగళవారం అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి మరియు అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 - 24 విద్యా సంవత్సరం లో ఆర్ట్స్ కళాశాల లో ప్రవేశపెట్టిన వివిధ కోర్సులు, సిలబస్, మరియు పరీక్షా విధానం గురించిన తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశానికి కళాశాల లోని వివిధ విభాగాధిపతులు హాజరయ్యారు.