చిన్న చిన్న విషయాలకు కూడా టీచర్లకు ఛార్జ్ మెమోలు ఇస్తూ మనోవేదనకు గురిచేయడం సరైనది కాదని ఏపీ ఎస్ ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. ఈ మేరకు అనంతపురం లో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఫార్టో చేస్తున్న ఉద్యమాలకు ఏపిఎస్ఈఏ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తోందని అన్నారు. టీచర్లకు బోధనలో స్వేచ్ఛ ఇచ్చినప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుందని అన్నారు.