సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో అద్దె ఇంటికి వచ్చిన 43, 516 రూపాయలు విద్యుత్ బిల్లును విద్యుత్ అధికారులు 1, 350 రూపాయలకు తగ్గించడంతో ఆ ఇంట్లో నివసిస్తున్న కూలీ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఈ సమస్యపై వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు పరిశీలించి మీటర్ రీడింగ్ తప్పుగా నమోదు చేయడంతో అధిక బిల్లు వచ్చినట్లు గుర్తించామని ఏ ఈ వెంకటేష్ నాయక్ తెలిపారు.