ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు కొనసాగుతున్న తవ్వకం పూర్తయింది. గత 17 రోజులుగా కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు 17 రోజుల ఆపరేషన్ తర్వాత సొరంగం తెరుచుకుంది. దీంతో మరికొద్ది సేపట్లో కూలీలను బయటికి వస్తారని అంటున్నారు.
సొరంగం నుంచి కార్మికులను బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్క సైనికుడు లోపలికి వెళ్తారు. కార్మికులను సురక్షిత వైద్య సదుపాయానికి తరలించడానికి అంబులెన్స్‌లు వచ్చాయి. వైద్యులను కూడా సొరంగం లోపలికి పంపించారు. అటువంటి పరిస్థితిలో, కార్మికులను బయటకు తీయడానికి చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్‌లో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం.
సొరంగం లోపల 7 నుంచి 8 పడకలు ఏర్పాటు చేశారు. మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇలా చేసినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి, కార్మికులు చిక్కుకున్న టన్నెల్ లోపల ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. ఒక్కసారిగా వారు బయటికి వస్తే సమస్య రాకుండా ఇలా ఏర్పాటు చేశారు.