లోకేష్‌పై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. లోకేష్ ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలిచాడా..? అని ప్రశ్నించారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటూ దళితులను అవమానించేలా చంద్రబాబు మాట్లాడాడని గుర్తుచేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పెట్టాలని చూశాడని, దళితులను అవమానించి, దాడులు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. చంద్రబాబుకు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అంబేడ్కర్ పేరు ఉచ్ఛరించే అర్హత కూడా చంద్రబాబు, లోకేష్‌కు లేదన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు దళితులను మోసం చేశాడని మండిపడ్డారు. తమకు సమవుజ్జీకానీ లోకేష్‌కు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.