అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదని సీఎం వైయస్ జగన్ అన్నారు. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడమని, ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిర్దేశించుకున్న గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa