వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.... జనం సముద్రకెరటాల్లా పోటెత్తడం చూస్తుంటే..జగనాభిమానానికి ఆకాశమే హద్దులా అనిపిస్తోంది. నేను విన్నాను, నేను చూసాను, నేను చేస్తాను అని నాడు పాదయాత్ర సందర్భంగా చూసిన పేద, అణగారిన వర్గాల కష్టాలు, కన్నీళ్లు తుడిచే దిశలోనే ..ఈ నాలుగున్నరేళ్ల పాలనను నడిపించారు జగనన్న. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను చట్టసభలకు పంపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే. జగనన్న ముందు ఎందుకు పనికిరాని నాయకుడు చంద్రబాబు. అణగారిన వర్గాలను మరింతగా అణిచిపెట్టాలని చూసిన దుర్మార్గుడు చంద్రబాబు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని, వారి స్థాయిని పెంచాలని చూస్తున్న మనసున్న మనిషి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పేదవాడి పిల్లాడు పేదవాడిగానే ఉండకూడదు. కార్మికుడి కొడుకు కార్మికుడిగానే ఉండిపోకూడదు. తక్కువ వృత్తుల్లో ఛిద్రమైన తండ్రుల్లానే వారి పిల్లలు కాకూడదు అన్న ఆలోచనతో... ఒక మామలా చదివిస్తున్నాడు జగనన్న.విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో పేద పిల్లలకు ఇంగ్లీషు చదువులు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్ స్కూళ్లతో సర్కారు బళ్లు పోటీపడేలా తయారయ్యాయి. పేదింట పిల్లలు.. దర్జాగా స్కూళ్లకు వెళ్లే పరిస్థితులొచ్చాయి. బాబు హయాంలో విద్యారంగంలో పదిహేనో స్థానంలో ఉన్న మనం...ఇప్పుడు మూడోస్థానంలో ఉన్నాం. ఇది బాబు పాలనకు, జగనన్న పాలనకు తేడా!నా బిడ్డ, నా తమ్ముడు, నా మనవడు, నా అన్నయ్య..ఇలా ప్రతివారు జగనన్నను తమ ఆత్మీయుల్లో ఒకరిగా చూసుకుంటున్నారంటే... దేశంలోనే మరే నాయకుడికి ఇంత అదృష్టం పట్టలేదనిపిస్తుంది అని అన్నారు.