వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.....ఇంత పెద్ద ఎత్తున సామాజిక సాధికార బహిరంగసభ జరుగుతుంటే ...చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో మన ముఖ్యమంత్రి జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. మహిళలకు అన్నింటా పెద్దపీట వేశారు. ఇక బడుగు, బలహీనవర్గాల పిల్లలు దర్జాగా బళ్లకు వెళుతున్నారంటే, ఆయా వర్గాల పేదలు ఈరోజు సంతోషంగా ఉన్నారన్నా, ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తున్నారన్నా అందుకు కారణం సీఎం జగన్.సుపరిపాలనకు సరైన అర్థం చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబువన్నీ కుట్రపూరిత రాజకీయాలు. ఆయన హయాంలో పేదలకు ఒరగబెట్టిందేమీ లేదు. గతంలో 600 పైగా హామీలిచ్చి, ఒక్కటీ నెరవేర్చని చరిత్ర చంద్రబాబుది. జనాల్ని ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి చంద్రబాబు.అందుకు భిన్నంగా, పేదల, బడుగు,బలహీన వర్గాల ప్రభుత్వంగా, తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు జగనన్న. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. దాదాపు 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత జగనన్నది. సామాజిక న్యాయంలో సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. మన రాష్ట్రం బాగుండాలంటే...జగనన్న కావాలి.విద్యా, వైద్యరంగాలు బాగుండాలంటే...జగనన్న కావాలి.వ్యవసాయం బాగుండాలన్నా..రైతన్నలు బాగుండాలన్నా, జగనన్న కావాలి. పేదల రెక్కల డొక్కల ఆకలి చప్పుళ్లు తెలిసిన నాయకుడు జగనన్నే అని తెలిపారు.
![]() |
![]() |