మత్స్యకారులను సీఎం జగన్ అక్కున చేర్చుకుని రాజ్యాధికారం ఇచ్చారని, మత్స్యకారుడుని పార్లమెంట్ కు పంపిన ఘనత జగన్ దే నని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను తోకలు కత్తిరిస్తానని, జడ్జిలుగా బిసిలు పనికి రారని కేంద్రానికి లేఖ రాసాడని, ఎస్సీగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఆ వర్గాలను వివిధ సందర్భాల్లో బెదిరించి అవమానాలకు గురి చేసారని, అలాంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి పిడికిలి బిగించి నడుంగట్టి నిగ్గదీసి నిలదీయాలని సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎవరి వద్ద చేయి చాపకూడదని జగన్ సంకల్పించి సంక్షేమ పథకాలను నిరంతరాయంగా జగన్ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పుట్టిన పిల్లాడు దగ్గర నుంచి పండు ముసలి వరకు సంక్షేమాన్ని అందిస్తూ చేయూతనిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని వెల్లడించారు. ప్రజలంతా ఆలోచించి జగన్ ను సీఎంగా మరోసారి గెలిచేందుకు ఆశీర్వదించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గుజరాత్ లో చిక్కిపోతే ప్రత్యేకంగా బస్సులు వేసి స్వగ్రామానికి తీసుకువచ్చారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో చిక్కుకుపోయిన మత్స్యకారులను తిరిగి వారి వారి ప్రాంతాలకు తీసుకురావడానికి జగన్ ఎంత కృతనిశ్చయంతో పని చేసారో అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎనాడైనా ఒక్క పోర్టు గానీ, హార్బర్ ను గానీ ప్రారంభించారా అని సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. జగన్ మత్స్యకారుల సంక్షేమానికి జిల్లాకో హార్బర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారన్నారు లోకేశ్, జగన్ కు భయాన్ని పరిచయం చేస్తాడట, నీ బాబు వల్లే కాలేదు, నీవేం చేయగలవు.. ఢిల్లీ వెళ్లి దాక్కున్నావు అని ఎద్దేవా చేసారు.
![]() |
![]() |