రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిస్తూ సంక్షేమ పాలనను జగన్ చేస్తున్నారని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కొనియాడారు. ప్రతిపక్షాలు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ ను ఓడించాలని చూస్తున్నారని, ప్రజలంతా ఆలోచన చేసి ఈ దుర్మార్గుల దురాలోచనతో వస్తున్న వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రియతమ నేత జగన్ ను మళ్లీ సీఎం గా గెలిపించుకోవడం ద్వారా ఇప్పటి సంక్షేమ పాలనను కొనసాగించవచ్చునన్నారు.