ఏలూరు జిల్లా కైకలూరులో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహం 12 గంటలకు సీతారాం ఫంక్షన్ హాలులో తటస్థులతో వైయస్ఆర్ సీపీ నాయకులు సమావేశం కానున్నారు. 3 గంటలకు ఫంక్షన్ హాలు నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం మార్కెట్ సెంటర్‌లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, జోగి రమేష్, పినిపే విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరుకానున్నారు.